హిందీ వెర్షన్‌లోనూ..

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్​ఆర్​'లో నటిస్తున్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. ఈ చిత్రం పూర్తవ్వగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో ప్రాజెక్టు మొదలుపెడతారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత 'కేజీఎఫ్​' చిత్రంతో సినీ అభిమానులను ఆకర్షించిన ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో.. తారక్​ నటించడానికి రంగం సిద్ధంచేసినట్లు సమాచారం. సైంటిఫిక్​ యాక్షన్​గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదిన్నర పాటు తారక్​ కాల్షీట్లు కావాలని దర్శకుడు ప్రశాంత్​ నీల్ ఆశిస్తున్నారట. ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్​లోనూ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ​ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాతో బిజీగా ఉన్న తారక్​.. త్రివిక్రమ్​, ప్రశాంత్​ నీల్​లతో ప్రాజెక్టులను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.