అక్కాత‌మ్ముడిగా జ్యోతిక‌.. కార్తి!

నిజ జీవితంలో జ్యోతిక... కార్తి వ‌దిన మ‌రిది అవుతారు. తెర‌పై మాత్రం ఒకే త‌ల్లికి పుట్టిన బిడ్ద‌లుగా క‌నిపించ‌బోతున్నారు. క‌థానాయ‌కుడు సూర్య భార్య అయిన జ్యోతిక‌, సూర్య త‌మ్ముడైన కార్తి జీతూజోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆ చిత్రం తమిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపొంద‌బోతోంది. తెలుగులోనూ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. దాంతో ఆ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. వ‌దిన మ‌రిదులు ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నార‌ని ప్ర‌త్యేకంగా ఆరా తీశారు. అయితే ఎట్ట‌కేల‌కి అందులో పాత్ర‌ల విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. వ‌దిన మ‌రిది కాస్త అక్కా త‌మ్ముళ్లుగా న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. జ్యోతిక త‌న రెండో ఇన్నింగ్స్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఆమె కోసం ఇటీవ‌లే నాగార్జున `బంగార్రాజు` చిత్రబృందం కూడా సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.