నాలోనూ అమ్మ మనసు ఉంది: కియారా
‘‘నేను డైపర్లు మార్చాను. పిల్లలకు ఏమీ చేయాలో వారిని ఎలా బుజ్జగించాలో నాకు తెలుసని’’ చెబుతోంది నటి కియారా అడ్వాణి. తాజాగా కియారా అడ్వాణి తన గురించి మాట్లాడుతూ..‘‘నేను పిల్లలకు డైపర్లు మార్చాను. పిల్లలతో సావాసం చేశా. వారితో ఉన్నప్పుడు నేనెంతో సంతోషంగాను ఉన్నాను. వాళ్లు ఎలాంటి కలష్మం లేని చిన్నారులు. చిన్నపిల్లలకి ఎలాంటి అరమరికలు ఉండవు. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటుంటారు. ఒక తల్లిగా ఏమీ లక్షణాలు ఉండాలో, అవన్నీ నాలోనూ ఉన్నాయి. నా వరకు ఓ మంచి తల్లికి ఉండాల్సిన అన్ని సుగుణాలు నాలోను ఉన్నాయని’’ చెప్పింది. ఇక తన చిత్ర నేపథ్యం గురించి చెబుతూ‘‘..నేనెప్పుడు అలనాటి నటులు సయీద్‌ జాఫ్రీ, అశోక్‌ కుమార్‌లను కలవలేదు. అలాంటి ప్రముఖులతో నా కుటుంబానికి బంధుత్వం ఉందని కూడా నాకు తెలియదు. నాటి బాలీవుడ్‌ నటుడు అశోక్‌ కుమార్‌ అమ్మ తరపు బంధువు అని చెప్పినప్పుడు..‘ఓహో అంతగొప్ప వారితో బంధుత్వం ఉందాని’ అనుకునేదాన్ని. గత ఏడాదిలో విడుదలైన ‘కబీర్‌ సింగ్’‌, ‘గుడ్‌ న్యూజ్‌’‌ మంచి విజయాల్ని సాధించాయి. అవి రెండు వేర్వురు రకాల పాత్రలు. అలాంటి వాటిలో ఎలా నటించాలి? ఆ రెండు పాత్రను ఎలా చేయాలనే ఆలోచించేదాన్ని. కష్టపడి పనిచేయడమే మన బాధ్యత. కానీ వాటి విజయాలు మాత్రం ప్రేక్షకులు ఆపై వాడు చూసుకుంటారు. ఇక ‘లస్ట్ స్టోరీస్’‌ చిత్రంలో నటించడానికి రమ్మని కరణ్‌ జోహార్‌ పిలిచినప్పుడు కచ్చితంగా ఇలాంటి వైవిధ్యమైన పాత్రను చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. బాలీవుడ్‌లో నేను నటించకముందే సూపర్‌స్టార్‌గా అలియా భట్‌ ఉంది. అప్పటికే బాగా పాతుకపోయింది. అయితే నా పేరు కూడా అలియా అడ్వాణి. నా పేరు మీద వచ్చే గందరగోళానికి స్వస్తి పలకాలి అనుకున్నా. నాపేరును అలియా నుంచి కియారాగా మార్చుకోమని సల్మాన్‌ఖాన్‌ సలహా ఇచ్చారని..’’చెప్పింది. కియారా అడ్వాణి తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో నటించింది. రామ్‌చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’ చిత్రంలోనూ కథానాయికగా నటించి అలరించింది. ప్రస్తుతం కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి ‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రంలో నటిస్తోంది.


View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.