నలుగురు దర్శకులు.. నాలుగు లస్ట్‌స్టోరీస్‌!!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులకు వెండితెరకు దీటైన ప్రత్యామ్నాయ వినోదం దొరికిపోయింది. అదే డిజిటల్‌ మీడియా సినీ ప్రేక్షకుల అర చేతుల్లోకి అందిస్తోన్న వెబ్‌సిరీస్‌లు. ఇప్పుడు హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు వెబ్‌ సిరీస్‌ల జోరే గట్టిగా కనిపిస్తోంది. మన దేశంలో తొలుత బాలీవుడ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ పనాలు వీయగా.. తర్వాత అవి దక్షిణాది భాషలకూ విస్తరించాయి. ఇప్పుడీ సిరీస్‌లలో నటించి ముచ్చట తీర్చుకోవాలని.. ఒక్క సిరీస్‌ అయినా తెరకెక్కించాలని అటు స్టార్‌ నటీనటులు, ప్రముఖ దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా తెలుగులో ఓ అదిరిపోయే వెబ్‌సిరీస్‌ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకీ ఆ సిరీస్‌ మరేదో కాదు.. ఉత్తరాది ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన కరణ్‌ జోహార్‌.. ‘లస్ట్‌స్టోరీస్‌’. ఇప్పుడు దీన్ని తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమైంది నెట్‌ఫ్లిక్స్‌. అంతేకాదు ఇందుకోసం ప్రస్తుతం తెలుగులో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న నలుగురు కత్తిలాంటి యంగ్‌ డైరెక్టర్లను వెతికి పట్టుకుంది. వాళ్లు మరెవరో కాదు.. సంకల్ప్‌ రెడ్డి, సందీప్‌ రెడి వంగా, తరుణ్‌ భాస్కర్, లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి. ఈ నలుగురు లస్ట్‌స్టోరీస్‌లోని ఒక్కో భాగానికి దర్శకత్వం వహించనున్నారట. వీళ్లలో ముందుగా సెట్స్‌పైకి వెళ్లబోతుంది మాత్రం నందిని రెడ్డి అట. ఇప్పటికే ఆమె పూర్తి స్క్రిప్ట్‌తో షూట్‌కు వెü™్లందుకు సిద్ధమైపోయిందట. అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ఈమె తెరకెక్కించబోయే భాగంలో అమలాపాల్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతుందట. అమలా ఇటీవలే ‘ఆమె’ కోసం నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘లస్ట్‌స్టోరీస్‌’ కోసం ఇంకెలాంటి సాహసం చేయబోతుందో వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పటికే తెలుగులో పలు వెబ్‌ సిరీస్‌లు సెట్స్‌పై ఉండగా.. అందరి దృష్టినీ ఆకర్షించబోయేది ఈ లస్ట్‌స్టోరీసే అని చెప్పొచ్చు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.