గాయని బయోపిక్‌ తెరకెక్కించనున్న సింగీతం?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాలీవుడ్‌ టాక్‌. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతి పంచారు. ఎప్పుడూ విభిన్న కథల్ని రూపొందించే ఆయన ఈసారి ప్రముఖ గాయని ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి జీవితకథను తెరపై ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నారట. ఎందరో గాయనిగాయకులకు స్ఫూర్తిగా నిలిచిన సుబ్బలక్ష్మి బాల్యం, గాయనిగా ఆమె చేసిన ప్రయాణం చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.