మహేష్‌ నిర్మాణంలో.. అడవి శేష్‌ హీరోగా!!
                                 

కొంత కాలంగా మహేష్‌ తన సినీ కెరీర్‌ను విభిన్నంగా పరుగులు పెట్టిస్తున్నాడు. ఓవైపు కథానాయకుడిగా చేస్తూనే నిర్మాతగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు ‘1 నేû•క్కడినే’ చిత్రంతో సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించుకున్న మహేష్‌.. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ తదితర చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగానూ వ్యవహరించాడు. ఐతే వీటిలో నిర్మాతగా మహేష్‌ పాత్ర నామమాత్రమే. ఎందుకంటే ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరుతో పారితోషికానికి బదులు లాభాల్లో వాటా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మహేష్‌ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారేందుకు సిద్ధమయ్యాడట. తన ‘ఎంబీ ప్రొడక్షన్స్‌’ నుంచి సొంతంగా ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. అంతేకాదు ఈ చిత్రానికి అడవి శేష్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం అందుతోంది. శేష్‌తో ‘గూఢచారి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించి టాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. ఇప్పుడీ యువ దర్శకుడే మహేష్‌ నిర్మిస్తున్న తొలి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఓ సరికొత్త థ్రిల్లర్‌ కథాంశంతో మీడియం రేంజ్‌ బడ్జెట్‌ మూవీగా దీన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రొడక్షన్‌ బాధ్యతలను నమ్రత స్వయంగా చూసుకోబోతుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.