దేవరకొండ హీరోగా.. మహేష్‌ చిత్రం??

ఇటీవల జరిగిన ‘మహర్షి’ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్, ఆ చిత్ర సక్సెస్‌మీట్, మరో స్పెషల్‌ పార్టీ.. ఇలా ప్రతిదాంట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఒకటుంది. అదేంటంటే ప్రతి వేడుకలో మహేష్‌తో పాటు రౌడీ హీరో కనిపించడం. ఈ నేపథ్యంలోనే విజయ్‌ దేవరకొండ ‘మహేష్‌ 26’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ఊహాగాన వార్తలు కూడా వెల్లువెత్తాయి. అయితే దీని వెనకున్న జరుగుతున్న కథ మరొకటుందని ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. తాజాగా ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ హీరో కథానాయకుడిగా మహేష్‌ నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రిన్స్‌ తన ఘట్టమనేని మహేష్‌బాబు (జిఎంబీ) బ్యానర్‌పై బయట హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన అడవి శేష్‌తో ‘మేజర్‌’ అనే చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పుడు దీని తర్వాతి ప్రాజెక్టుగా దేవరకొండతో ఓ మూవీని రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రౌడీ హీరో ‘డియర్‌ కామ్రేడ్‌’ కాకుండా మైత్రీ మూవీస్‌తో మరో సినిమా చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే జిఎంబీ బ్యానర్‌లో విజయ్‌ చేయబోయే సినిమా పట్టాలెక్కుతుంది. మరి ఈ చిత్రాన్ని జిఎంబీ ఒక్కటే నిర్మిస్తుందా.. లేక మరే నిర్మాణ సంస్థనైనా భాగస్వామిగా చేర్చుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడెవరు? నటీనటులు ఎవరు? వంటి విషయాలన్ని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.