ఆయనకు వివాహమైనపుడు నా గుండె పగిలింది

మనం ఎంతగానో అభిమానించే, ఆరాధించే నటీనటులకు పెళ్లైతే ఫీల్‌ అవుతుంటాం కదూ! ప్రముఖ నాయిక మీనా కూడా తన అభిమాన నటుడికి వివాహమైతే బాధపడిందట. ఆ హీరో ఎవరో తెలుసా? మీనాకు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ అంటే చాలా ఇష్టమని తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. 2000లో జరిగిన హృతిక్‌ పెళ్లి విందులో ఆయనతో కరచాలనం చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంటూ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘ఆ రోజు నా గుండె పగిలింది (నవ్వుతూ..). నాకు బాగా నచ్చిన నటుడు హృతిక్‌ను ఆయన పెళ్లి అనంతరం బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కలిశా’ అని ‍‍అప్పటి మధుర క్షణాలు గురించి చెప్పారామె. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆమెను పలు ప్రశ్నలు అడిగ్గా స్పందించారు మీనా. ‘‘విలన్‌’ సినిమాలని పాటలో మంచులో మీరు చేసిన డ్యాన్స్‌ను హృతిక్‌ ప్రశంసించారు. ఆ వార్త నేను చదివా’ అని ఓ అభిమాని కామెంట్‌ పెట్టారు.  ‘‘ఆ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హృతిక్‌, అమితాబ్‌, కరీనా కపూర్‌ అక్కడే ఉన్నారు. మంచు కురుస్తున్నా షూట్‌ అపలేదు మేము. దీంతో మమ్నల్ని మెచ్చుకున్నారు. అక్కడే ఉన్న కరీనా తల్లి నాకేమైనా అవుతుందేమో అని భయపడ్డారు, నన్ను తిట్టారు. ప్రతి షాట్‌ తర్వాత హాట్‌ చాక్లెట్‌ తినమని చెప్పారు. పదేళ్ల క్రితం వచ్చిన వార్తను ఇంకా గుర్తుపెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. మరో నెటిజన్‌ ‘బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదా?’ అని ప్రశ్నించగా ‘అవకాశాలు వచ్చాయి కానీ ఇక్కడి చిత్రాలతో బిజీగా ఉన్నాన’ని తెలిపారు.

Follow For More @Sitara.NetCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.