‘బిగ్‌బాస్‌ 3’కి నాగ్‌ అంత తీసుకుంటున్నారా?

బుల్లితెర అభిమానుల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ‘బిగ్‌బాస్‌’ మూడో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈసారి ఈ షో కోసం స్వయంగా నాగార్జునే రంగంలోకి దిగడంతో అందరిలోనూ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ కార్యక్రమం కోసం నాగ్‌ అందుకుంటోన్న పారితోషికం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘బిగ్‌బాస్‌ 3’ కోసం నాగ్‌ దాదాపు రూ.12 కోట్లు పారితోషికం అందుకోబోతున్నారట. అంటే.. ఈ కార్యక్రమం దాదాపు వంద ఎపిసోడ్‌లో జరుగనుండగా ఒక్కో ఎపిసోడ్‌ కోసం మన్మథుడుకి దాదాపు రూ.12 లక్షలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కోసం ఒక్కో ఎపీసోడ్‌కు రూ.7లక్షలు అందుకున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.