నవల రాస్తున్న నాని
నాని కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇష్క్‌’, ‘మనం’లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అయిదుగురు కథానాయికలు కనిపించనున్నారు. నానితో అయిదుగురు కథానాయికలు అనేసరికి ఇదో ప్రేమకథేమో అనుకున్నారంతా. నానిని లవర్‌ బోయ్‌గా చూపిస్తారేమో అని ఆశించారు. కానీ... ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇందులో నాని ప్రేమికుడిగా కాదు, నవలా రచయితగా కనిపించనున్నాడట.


వర్థమాన రచయితగా నాని పాత్ర ఉండబోతోందని, నాని రాసిన నవల్లోని పాత్రలు నాని ముందుకు వస్తుంటాయని, ఆ పాత్రలతో నాని ప్రయాణం చేయడమే ఈ కథాంశమని సమాచారం. విక్రమ్‌ కె.కుమార్‌ ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటుంటాడు. ఈసారీ అలాంటి జోనర్‌లోనే ఓ థ్రిల్లింగ్‌ కథని చూపించబోతున్నాడు. మరి నవలా రచయితగా నాని ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.