తొలిసారి తెలంగాణ యాసలో

సరికొత్త కథలతో వచ్చే దర్శకులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు యువ కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణతో చేస్తున్న ‘టక్‌ జగదీష్‌’ మినహా ఆ తర్వాత చేయబోయే చిత్రాలన్నీ నవతరం దర్శకులతో చెయ్యనున్నవే. వీటిలో రాహుల్‌ సంకృత్యాన్, వివేక్‌ ఆత్రేయ చిత్రాలతో పాటు సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌తో చెయ్యనున్న ఓ కొత్త చిత్రమూ ఉంది. దీన్ని సుధాకర్‌ చెరకూరి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం కోసం తొలిసారిగా తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పబోతున్నారట నాని. ఆయన ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ కోసం గోదావరి యాసలో, గతంలో ‘కృష్ణార్జున యుద్ధం’ కోసం చిత్తూరు యాసలో సంభాషణలు చెప్పారు. ఇప్పడీ క్రమంలోనే ఈ రాబోయే కొత్త ప్రాజెక్టు కోసం తెలంగాణ యాసలోనూ తన పట్టును ప్రదర్శించనున్నారని సమాచారం. తెలంగాణ ప్రాంత నేపథ్యంగా సాగే ఓ వైవిధ్యమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

View this post on Instagram

Nothing matches the old world charm :) Clicked on a old Minolta SRT 101 Ilford 400 ISO Black and White Film 📸: @saileshkolanu

A post shared by Nani (@nameisnani) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.