ఒకే చిత్రంలో నయన్, సామ్‌?

నయన్‌ తార.. కోలీవుడ్, టాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్‌ ఉన్న నాయిక. సమంత.. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్య పాత్రలకు కేరాఫ్‌ అనిపించుకున్న కథానాయిక. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ తన ప్రతిభ చూపింది. మరి ఈ ఇద్దరు కలిసి ఒకే చిత్రంలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ సర్‌ప్రైజ్‌ అందించేందుకే ప్రయత్నాలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. విజయ్‌ సేతుపతిమ కథానాయకుడుగా తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇందులో ఇద్దరు నాయికలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలకు నయన్, సామ్‌ మాత్రమే చేయగలరని విఘ్నేష్‌ భావిస్తున్నాడట. ఇప్పటికే చర్చలు సాగాయని టాక్‌. మరి ఈ ఇద్దరు అగ్ర నాయికలు కలిసి అభిమానులకు ట్రీట్‌ ఇస్తారో, లేదో? కొన్ని రోజులు ఆగాల్సిందే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.