సెగలు రేపుతున్న.. సోగసుల నిధి

‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు దొరికిన సొగసుల నిధి.. నిధి అగర్వాల్‌. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. తన అందం, అభినయంతో అక్కినేని వారసులిద్దరిని బుట్టలో వేసేసుకుంది. చైతూ, అఖిల్‌లతో వరుస ఆఫర్లు అందుకొని సత్తా చాటింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో అల్లరి చేసేందుకు ముస్తాబవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ కవ్వింపులకు వెండితెర మాత్రమే కాదు.. సోషల్‌ మీడియా కూడా అడ్డాగా నిలుస్తోంది. తాజాగా ఈ సోకుల నిధి ట్విటర్‌లో పెట్టిన రెండు ఫొటోలు, దానికి ఆమె రాసిన వ్యాఖ్యలు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపాయి. ఈ ఫొటోల్లో నిధి.. హరివిల్లులోని రంగులన్నీ మీద ఒలకబోసుకున్నట్లుగా కలర్‌ఫుల్‌ స్కర్ట్‌తో, గులాబీ రంగు టాప్‌ ధరించి స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. అంతేకాదు వీటికి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా జోడించింది. ‘‘శుభోదయం. మీ అందరికీ ఈ రోజు నా స్కర్ట్‌లా రంగులమయంగా ఉండాలని ఉండాలని కోరుకుంటున్నా’’ అని ఒక ఫొటోకు కొంటెగా కామెంట్‌ పెట్టగా.. మరోదానికి ‘‘ఈ విధంగా అందరికీ ముద్దివ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అని కవ్వించే వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ స్టిల్స్‌ రెండు నెటింట తెగ సందడి చేస్తున్నాయి. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.