నిధి అక్క‌డ ఎంట్రీ ఇస్తోంది

అక్కినేని అన్న‌ద‌మ్ముల సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్‌. బాలీవుడ్‌లో తొలి సినిమా చేసిన ఈ బెంగుళూరు బ్యూటీ టాలీవుడ్‌లో వ‌రుస‌గా రెండు అవ‌కాశాలు అందుకోవ‌డంతో అంతా ఈమె గురించే మాట్లాడుకున్నారు. అయితే నాగ‌చైత‌న్య‌తో క‌లిసి చేసిన `స‌వ్య‌సాచి` ఈమెకి అంతంత మాత్ర‌మే పేరు తెచ్చిపెట్టింది. అఖిల్‌తో చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను`తో ఓ స్థాయి విజ‌యాన్ని అందుకొంది. ప్ర‌స్తుతం రామ్ స‌ర‌సన `ఇస్మార్ట్ శంక‌ర్‌`లో న‌టిస్తోంది. తొలి రెండు సినిమాలు హిట్టు అనిపించుకుని ఉంటే ఈమె రేంజ్ మారిపోయేది. అయినా ఇప్ప‌టికీ ఆమె గ్లామ‌ర్ టాలీవుడ్‌ని వూరిస్తోంది. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో విజ‌యాన్ని అందుకుంటే నిధి టాలీవుడ్‌లో మైలేజీని సొంతం చేసుకున్న‌ట్టే. మ‌రి ఆ చిత్రం ఏం చేస్తుందో చూడాలి. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌మిళంలో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మైపోయింది. అక్క‌డ అగ్ర క‌థానాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న జ‌యం ర‌వి 25వ సినిమాలో నిధి అగ‌ర్వాల్ అవ‌కాశం అందుకున్న‌ట్టు స‌మాచారం. ల‌క్ష్మ‌ణ్ అనే ద‌ర్శ‌కుడు ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. జ‌యం ర‌విలాంటి అగ్ర క‌థానాయ‌కుడితో న‌టించే అవ‌కాశం అంటే నిధి జాక్ పాట్ కొట్టిన‌ట్టే. చూస్తుంటే ఈమె బాలీవుడ్‌ని వ‌దిలిపెట్టి ద‌క్షిణాదినే టార్గెట్ చేసినట్టు క‌నిపిస్తోంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.