తన మరణాన్ని ముందే చెప్పేసింది

చావు పుట్టకలు దైవాధీనమంటారు పెద్దలు. మనిషి ఎప్పుడు భూమిపై అడుగుపెడతాడు.. ఎప్పుడు ఈ భువిని వదిలి దివికేగుతారన్నది ఏ ఒక్కరూ అంచనా వేయలేరు. అయితే విజయ నిర్మల విషయంలో ఈ సూత్రం మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తన మరణాన్ని ముందుగానే గ్రహించిందట. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స అందించిన కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పడం చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. విజయ నిర్మలకు చికిత్స అందిస్తున్న సమయంలో వైద్యులు ఆమెతో.. ‘‘మీరు అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటారని.. ఏం అధైర్య పడొద్దని’’ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారట. దానికి ఆమె బదులిస్తూ.. ‘‘పోవడం.. ఉండడం మన చేతిలో లేదు. నేను ఎప్పుడు పోయినా ఆరోజు మాత్రం కచ్చితంగా గురువారం అవుతుంది’’ అని అన్నారట. విజయ నిర్మలకు సాయిబాబాపై ఉన్న విపరీతమైన భక్తి - విశ్వాసాల వల్లనే ఆమె నోట ఇలాంటి పలుకులు వినిపించాయి. కానీ, ఆఖరికి ఆమె అన్నట్లుగానే తనకెంతో ఇష్టమైన గురువారం వేకువ ఝామునే ఆ బాబాలో లీనమయ్యారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.