ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో సంజయ్‌ దత్‌!

ఎన్టీఆర్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తరువాత త్రివిక్రమ్‌- తారక్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించేలా ఆయన పాత్రను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో సంజయ్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడట. లాక్‌డౌన్‌ కారణంగా దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో.. సామాజిక మాధ్యమాల వేదికగా తారక్‌ అభిమానులు చిత్రబృందంపై ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ఆ మధ్య ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఎన్టీఆర్‌ 30 కి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వమని చాలా సందేశాలు వస్తున్నాయి. షూటింగ్‌ ప్రారంభమైన వెంటనే వివరాలు వెల్లడిస్తాం. టైటిల్‌ ప్రకటించే విషయంలో సెంటిమెంట్‌ ఉంది. అందుకే చెప్పలేకపోతున్నాం. మమ్నల్ని నమ్మండి. పెద్ద సర్‌ప్రైజ్‌ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామ’’ని తెలిపారు. హారిక హాసిని, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగానే సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్‍ చూస్తున్నాడట. మరోవైపు సంజయ్‌దత్‌కు లంగ్‌ క్యాన్సర్‌. సంజు ముంబైలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే సంజయ్‌ దత్‌ మొదటి సెషన్‌ కీమో థెరఫీ చికిత్స తీసుకుంటున్నారు. అయినా సరే సంజయ్‌ దత్‌ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.