ప్రభాస్‌ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌!!

ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీప్రియులంతా ‘సాహో’ రాక కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన మాత్రం తన తర్వాతి చిత్రం ‘జాన్‌’తో బిజీగా గడిపేస్తున్నారు. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. దీన్ని వచ్చే ఏడాది ప్రధమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడిది సెట్స్‌పై ఉండగానే డార్లింగ్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ చిత్రసీమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ కథను డైరెక్ట్‌ చేయబోతున్నట్లు సమాచారం. దీని కథను మరో రెండు రోజుల్లో ప్రభాస్‌ విననున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందుగా ఈ కథను ‘కేజీఎఫ్‌’ హీరో యష్‌ వద్దకు తీసుకెళ్లగా.. ఇంతటి యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథకు ప్రభాస్‌ అయితేనే సరిగ్గా సరిపోతాడని సలహా ఇచ్చాడట. దీంతో ఇప్పుడీ కథ డార్లింగ్‌ వద్దకొచ్చి ఆగింది. మరి ఈ కథ ప్రభాస్‌ను మెప్పిస్తుందా.. ఇంతకీ ఇంతటీ క్రేజీ కథను ప్రేక్షకులకు చూపించబోయే ఆ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరు? వంటి వివరాలన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.