‘ప్రభాస్‌20’ అద్భుతమైన కథ..
‘మిర్చి’ తర్వాత నుంచి ప్రభాస్‌ సినీ ప్రయాణమంతా యక్షన్‌ కథలతోనే సాగుతోంది. జక్కన తెరకెక్కించిన హిట్‌ సిరీస్‌ ‘బాహుబలి’.. ప్రస్తుతం సుజీత్‌ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ‘సాహో’.. ఇలా ప్రతిదీ యాక్షన్‌ హంగామాతో చుట్టూనే తిరుగుతోంది. అందుకే తన 20వ చిత్రం కోసం యాక్షన్‌ బాటను వీడి ప్రేమ దారిలోకి తన ప్రయాణాన్ని మళ్లించాడు డార్లింగ్‌. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జºడీగా పూజ హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి పూజ ఓ కార్యక్రమంలో మాట్లాడింది. ‘‘ప్రతి లవ్‌స్టోరీలో నాయకానాయికల మధ్య ప్రేమ, అలకలు, ప్రేమకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు వంటి అంశాలు సహజమే. అయితే.. ప్రేమకథల్లో నటించడం అంత సులభమైతే కాదు. ప్రభాస్‌ 20.. ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో ఛాలెంజింగ్‌గా అనిపించిన స్క్రిప్ట్‌ ఇదే. చిత్ర కథ విన్నాక మతిపోయినట్లయింది. అంత అమెజింగ్‌ కథ ఇది. ఇందులో నాది చాలా ఛాలెంజింగ్‌ రోల్‌. ఇలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం. సినిమా కోసం మేమంతా చాలా కష్టపడుతున్నాం. ఓ అందమైన చిత్రమిది. ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని సినీప్రియులకు మాటిస్తున్నా’’ను అంది పూజ.* ‘మిర్చి’కి ఆరేళ్లు...
ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘మిర్చి’ సినిమా వచ్చి నేటికి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే కొరటాల శివ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాతో డార్లింగ్‌ మాస్‌ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌’, ‘వీలైతే ప్రేమిద్దాం డూడ్‌. మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌లు సినీప్రియులతో విజిల్స్‌ వేయించింది. పైకి ఓ ఫాక్షన్‌ కథలా అనిపించినా కుంటుంబ బంధాలు, మానవ విలువలకు సినిమాలో ఎంతో ప్రాధాన్యమిచ్చారు కొరటాల. ఇందులో ప్రభాస్‌కు జºడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్‌ నాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం విశేష జనాదరణ పొందింది. ఈ సినిమా విడుదలై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొరటాల ట్విటర్‌ వేదికగా అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.