ఆ చిత్రంతో నటుడిగా మారుతున్నాడు?

రియాలిటీ షోలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. స్వతహాగా ఈయన గాయకుడు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడుగా మారబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. బుల్లితెరపై తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న రాహుల్‌ వెండితెరపై అలరించేదుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అదే సినిమా అంటే? ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’. ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ తెరంగ్రేటం చేస్తున్నాడట. ప్రత్యేక పాత్రలో దర్శనివ్వబోతున్నాడని టాక్‌. ‘లై’, చిత్రంలోని ‘బొమ్మోలే ఉన్నది పోరి’, ‘రంగస్థలం’లోని ‘రంగ రంగ రంగస్థలాన’.. వంటి హుషారెత్తించిన పాటలు ఆలపించింది రాహులే. ఇప్పటి వరకు గానంతో అలరించిన రాహుల్‌ నటుడుగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.