ఇదే జోడీ 28 ఏళ్ల తర్వాత..

28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటుస్తున్నారు రాజ్‌ కిరణ్, మీనా. వారిద్దరూ కలిసి 1991లో వచ్చిన ‘ఎన్‌ రాసావిన్‌ మనసిలే’ చిత్రంలో నటించారు. అప్పట్లో ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇందులో వీళ్లద్దరి నటనకు ప్రేక్షకులు పట్టం కట్టారు. మళ్లీ ఇన్నేళ్లకు ‘కుబేరన్‌’ అనే సినిమాతో కలిసి సందడి చేయనున్నారు మీనా, రాజ్‌. ఇది తెలిసిన ఈ ఇద్దరి అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. ఇదే చిత్రం మలయాళంలో ‘షైలాక్‌’ పేరుతో తెరకెక్కుతోంది. అజయ్‌ వాసుదేవ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇనేళ్ల తర్వాత కలిసి నటించి ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తారో చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.