రాజ‌మౌళి త‌న‌యుడి `ఆకాశ‌వాణి`
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ పూర్తిస్థాయిలో నిర్మాత‌గా మార‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. త‌న తండ్రి ద‌గ్గ‌ర ప‌లు చిత్రాల‌కి స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన గంగ‌రాజు అశ్విన్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ `ఆకాశ‌వాణి` అనే చిత్రం తీయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. తండ్రి రాజ‌మౌళి చేసే సినిమాల‌కి వెన్నుద‌న్నుగా నిలుస్తుంటాడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌. స‌హాయ ద‌ర్శ‌క‌త్వం మొద‌లుకొని... అన్ని ప‌నులూ చేస్తుంటాడు. నిర్మాణంలోనూ ఆయ‌న‌కి మంచి ప‌ట్టుంది. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `యుద్ధం శ‌ర‌ణం` సినిమాకి లైన్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆయ‌న నిర్మాణ ద‌క్ష‌త‌ని గుర్తించిన రాజ‌మౌళి త‌న ఇంటి నుంచే ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించి, ఆ బాధ్య‌త‌ల్ని త‌న‌యుడికి అప్ప‌జెప్పాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆకాశ‌వాణి మొద‌లు కాబోతోంద‌ని, అదొక పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి త్వ‌ర‌లోనే ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రాన్ని మొద‌లు పెట్ట‌బోతున్నారు. మ‌రి ఆయ‌న నిర్మాణ సంస్థ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.