ఆకథలు ఇచ్చే అనుభూతి చెప్పలేనిది
నటులు అన్ని రకాల కథల్లోనూ, పాత్రల్లోనూ నటించాలని ఆశపడుతుంటారు. వ్యక్తిగతంగా మాత్రం కొన్ని రకాల కథల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి ప్రేమకథలంటే చాలా ఇష్టమట. వాటిలో కథానాయికలకి మంచి పాత్రలు దొరుకుతాయనా అంటే? ‘‘అది ఒక కారణం కావొచ్చేమో కానీ... ఒక ప్రేక్షకురాలిగా కూడా నాకు ప్రేమకథలు ఇచ్చినంత అనుభూతి మరెక్కడా దొరకదు. వాటిని చూసేటప్పుడు నేను నటిని అనే విషయం కూడా గుర్తుకు రాదు. ఇక వృత్తి పరంగా అయితే ఆ తరహా కథల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. మాలోని నటనని బయటికి చూపించే అవకాశం ప్రేమకథలతోనే లభిస్తుందని నమ్ముతుంటా’’ అని చెప్పుకొచ్చింది రకుల్‌. నిజ జీవితంలో మాత్రం తనకి ఎలాంటి ప్రేమకథలు లేవంటోందామె. ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న రకుల్‌ త్వరలోనే తెలుగులో ఓ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోంది. సినిమా కోసం గడిపే ప్రతి క్షణం ఓ గొప్ప ఆనందాన్నిస్తోందని, అంతగా తాను వృత్తిని ప్రేమిస్తున్నానంటోంది రకుల్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.