అల్లు ‘రామాయణ’లో సీతగా నయన్‌!!

భారతీయ ఇతిహాసాలలోనే గొప్పదైన రామాయణాన్ని ఇప్పటికే అనేక మంది దర్శకులు అనేక రకాలుగా వెండితెరపై ఆవిష్కరించారు. కానీ, ఇప్పుడీ మహా కావ్యాన్ని 3డి హంగులద్ది ప్రేక్షకులకు చూపించబోతున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఇందులో మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టును దర్శకులు నితీష్‌ తివారి, రవి ఉద్యావర్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం నటీనటుల ఎంపికను వేగవంతం చేసిందట. తాజాగా ఈ చిత్రంలోని సీత పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తోందట చిత్ర యూనిట్‌. ఆమె గతంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా కనిపించి ఆ పాత్రకు జీవం పోసింది. అందుకే ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉందట. మరి దీనిపై నయన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి. ‘రామాయణ’ పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ చిత్ర తొలి భాగం 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.