కలిసి ఉంటే కలదు సుఖం

‘‘మన జీవితాల్లో జరిగే ప్రతిదీ ఒక బలమైన కారణం కోసమే. నేనైతే ఏం జరిగినా అది కచ్చితంగా ఒక మంచి కారణం కోసమే అని నమ్ముతా’’ అంటోంది రష్మిక. అవకాశాల పరంగానూ, విజయాలు అందుకోవడంలోనూ జోరు ప్రదర్శిస్తున్న కథానాయిక ఈమె. మహేష్‌, అల్లు అర్జున్‌, నితిన్‌ తదితర కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. త్వరలోనే ‘డియర్‌ కామ్రేడ్‌’తో సందడి చేయబోతోంది. సానుకూల దృక్పథంతో మెలగడం చిన్నప్పట్నుంచే అలవాటైందని చెబుతోంది రష్మిక. అందుకే ఒడుదొడుకులు ఎదురైనా కంగారుపడకుండా, పరిష్కారం గురించి ఆలోచిస్తా అంటోంది. సినీ ప్రయాణంలో మీకు ఏ దశ కష్టంగా అనిపిస్తుందని అడిగితే... ‘‘సినిమా పూర్తయ్యాక మేం చాలా కష్టపడి పనిచేశామని చెబుతుంటాం. నిజమే.. సెట్‌లో కష్టం ఉంటుంది. అది అందరూ పడే కష్టమే. కానీ నాకు మాత్రం కథల ఎంపిక అన్నిటికంటే క్లిష్టంగా అనిపిస్తుంటుంది. దానిపై ఓ నిర్ణయానికొచ్చానంటే సగం పని పూర్తి చేసినట్టు భావిస్తుంటా’’ అని చెప్పింది రష్మిక.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.