ఇకపై అలాంటివి చేయాలంటే భయమే!

రెజీనా కసంద్ర తెలుగులో ‘ఎస్.ఎం.ఎస్‌’:(శివ మనసులో శృతి) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ లాంటి చిత్రాల్లో తనదైన రీతిలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘చక్ర’ చిత్రంలో పత్రినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తుందని సమాచారం. ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌ చేసిన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రెజీనా. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చుంబనాలు, కౌగిలింతల సన్నివేశాల్లో నటించడం అంటే చాలా భయేస్తుంది. దర్శకుడు తన స్ర్కిప్టులో అలాంటి ప్రత్యేక దృశ్యాలు కచ్చితంగా చేయాలంటే మాత్రం ఎవరేమీ చేయలేం. కనుక పరిస్థితిని బట్టి మారవచ్చు అని..’’చెబుతోంది. గత ఏడాది తెలుగు, తమిళ్లో విడుదలైన ‘7’ చిత్రంలో సరస్వతి పాత్రలో నటించింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవరు?’ చిత్రంలో అడవి శేషుతో కలిసి అలరించింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.