డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ కథేంటంటే??

ట్టకేలకు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిక్కుముడులన్నీ విడిపోయాయి. ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రామ్‌చరణ్‌ యువ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతుండగా.. జూ.ఎన్టీఆర్‌ యువ కొమురం భీమ్‌గా దర్శనమివ్వబోతున్నాడు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ను ఎంపిక చేసుకోగా.. ఎన్టీఆర్‌ కోసం హాలీవుడ్‌ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ని దించేశాడు. అయితే వీరిలో ఆలియా పేరును మీడియా ముందే పసిగట్టినప్పటికీ.. తారక్‌ జోడీనే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రెస్‌మీట్‌ ముందువరకు డైసీ ఎడ్గర్ జోన్స్ అనే పేరు భారత మీడియాకే కాదు.. సినీ ప్రియులకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అమ్మడు పుట్టుపూర్వోత్తరాల గురించి గూగులమ్మను తెగ జల్లెడ పట్టేస్తున్నారు నెటిజన్లు.


నెట్టింట అందుబాటులో ఉన్న సంక్షిప్త సమాచారం మేరకు డైసీ బ్రిటిష్‌కు చెందిన మోడల్, టీవీ నటి. అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందిన కామెడీ డ్రామా టెలివిజన్‌ సిరీస్‌ ‘కోల్డ్‌ ఫీట్‌’తో బుల్లితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఒలీవియా పాత్రతో బ్రిటిష్‌ వాసుల మదికి దగ్గరయింది. దీని తర్వాత ఆమె ‘వార్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌’, ‘పాండ్‌ లైఫ్‌’లోనూ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. సుప్రసిద్ధ నేషనల్ యూత్ థియేటర్ లో శిక్షణ తీసుకున్న నటి డైసీ. ఇందులో నుంచే హెలెన్ మిర్రెన్-కాథరిన్ టేట్ లాంటి నటీనటులు వచ్చారు. డైసీ ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది అన్నది కచ్చితంగా తెలియరాన్నప్పటికీ ఆమె నటిగా మారడం వెనుకున్న ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. డైసీ చిన్నతనంలో మిగతా పిల్లలతో పోల్చితే చదువులో చాలా వెనుకబడి ఉండేదట. క్లాస్‌లోనూ ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేదట. ఐతే తనకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు స్కూల్లో జరిగిన ఓ నాటికలో చేయగా.. ఆమె నటన చూసి అక్కడి వారంతా ‘వావ్‌ రియల్లీ గుడ్‌’ అని ప్రశంసల్లో ముంచెత్తారట. ఆ ప్రశంసలే ఆమెను తర్వాత నటిగా మారేందుకు పోత్సహించినట్లు ఓ ప్రముఖ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమెరికన్‌, ఐరిష్‌ యాసలో మాట్లాడగలుగుతుంది. గిటార్‌ వాయించడం, పాటలు పాడటం అంటే ఆమెకు చాలా ఇష్టం. డ్యాన్స్‌ కూడా చేస్తుంది. ఫిట్‌గా ఉండటానికి వీలైనప్పుడల్లా స్విమ్మింగ్‌ చేస్తుంది. డైసీకి గులాబీలన్నా, టాటూలన్నా ఇష్టం. అందుకే ఆ రెండింటినీ కలిపి భుజం మీద గులాబీ టాటూగా వేయించుకుంది. ‘త్రో బ్యాక్‌’ పేరుతో ఎప్పటికప్పుడు ‘పాత’ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.