సినీ రంగాన్ని వదిలేద్దామనుకున్నా!

బుల్లితెరపై డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించి సినీ రంగ ప్రవేశం చేసింది సాయి పల్లవి. తనదైన వేషధారణ, మాటలతో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. మరి ఇలాంటి సాయి పల్లవి సినిమాలు వద్దు అని చెప్పిందంటే నమ్మగలమా! తమిళ నటుడు సూర్యతో కలిసి సాయి పల్లవి నటించిన చిత్రం ‘ఎన్జీకే’. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని పదే పదే రీషూట్‌ చేసేవారు దర్శకుడు. దాంతో సినిమా రంగాన్ని వదిలేస్తానని వాళ్ల అమ్మకు చెప్పి ఏడ్చిందట సాయి పల్లవి. ఆ తర్వాత అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేందుకే దర్శకుడు అన్ని సార్లు చిత్రీకరిస్తున్నారని తెలుసుకుంది. పాజిటివ్‌ ఆలోచనతో ముందుకు సాగింది. ప్రస్తుతం రానా కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.