‘దళపతి’ కుదరక ‘రణరంగం’ చేశాం

శర్వానంద్‌ కథానాయికుడుగా ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘రణరంగం’. యువ దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ముందుగా ఈ సినిమాకు ‘దళపతి’ అనే టైటిల్‌ పెడదామనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యమవలేదని, ఏ పేరు పెట్టాలి?అనే సందేహంలో ఉన్నప్పుడు ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ రణరంగం ఎలా ఉందని అడిగితే.. సౌండింగ్‌ బావుంది ఇదే ఖరారు చేసేద్దామని చెప్పారట. అలా ఈ యాక్షన్‌ మూవీకి ‘రణరంగం’ కుదిరింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో కాజల్, కల్యాణి ప్రియదర్శిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు,ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచుతున్నాయి.
 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.