వెబ్‌సిరీస్‌గా సిల్క్‌ స్మిత కథ!
తనదైన ప్రత్యేక నృత్యాలు.. అదరగొట్టే అభినయాలతో ఓ తరం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల తార సిల్క్‌ స్మిత. వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. ఆ వెలుగుల మధ్యనే అనేక అగాథాలను చవిచూసి.. చివరికి ఆ చీకట్ల మధ్యేనే దయనీయ స్థితిలో కన్నుమూసింది సిల్క్‌. ఇప్పటికే ఈమె జీవితాధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’ వెండితెరపై సందడి చేయగా.. త్వరలో తమిళ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ ఈ బయోపిక్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సిల్క్‌ జీవితంలోని అనేక చీకటి కోణాలను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించబోతున్నారట. మరి ఈ వెబ్‌సిరీస్‌లో సిల్క్‌గా ఎవరు కనిపిస్తారో చూడాల్సి ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.