అన్నింటికీ విజయమే కొలమానం కాదు!
‘‘అందరి లక్ష్యం విజయమే కావొచ్చు. నేనూ విజయం కోసమే పనిచేస్తా. కానీ వాటికి మించిన అంశాలెన్నో ఉన్నాయి’’ అంటోంది కాజల్‌. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. కాజల్‌ మాట్లాడుతూ ‘‘విజయాలు ముఖ్యమే. కానీ.. వాటి కోసం మాత్రమే పనిచేయకూడదు. ఇష్టమైన పనిచేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన పని మనకు నచ్చితే ఓ గొప్ప అనుభూతికి లోనవుతాం. నాకు అది చాలు. మన కష్టం పదిమంది గుర్తిస్తే బాగుంటుంది. దానికి విజయమే కొలమానం కాకపోవచ్చు. ఓ సినిమా చేసినప్పుడు నటిగా నాకు సంతృప్తి దొరకవచ్చు. ఆ సినిమాతో కొంతమంది కొత్త స్నేహితుల్ని, అభిమానుల్ని సంపాదించొచ్చు. లేదంటే కొత్త పాఠాలేవో నేర్చుకోవచ్చు. ఇవన్నీ నాకు ముఖ్యమే’’ అంటోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.