టాలీవుడ్‌ ఆర్నాల్డ్స్‌లా మారిన శౌర్య.. సుధీర్‌!!
రడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహాలు, ఒంటి చేత్తో ప్రత్యర్థుల్ని మట్టికరిపించగల సత్తా.. ఈ మాటలు వినపడగానే సినీప్రియుల కళ్లలో మెదిలో తొలి రూపాలు హాలీవుడ్‌ కథానాయకులవే. ముఖ్యంగా ఆర్నాల్డ్‌, సిల్వేస్టర్‌ స్టాలోన్‌ వంటి ఉక్కు దేహాల వంటి కథానాయకులే గుర్తొస్తారు. కానీ, ఇక నుంచి ఆ మాటలు వచ్చినప్పుడల్లా మేమే గుర్తొస్తామంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న టాలీవుడ్‌ కుర్ర హీరోలు. తెలుగు చిత్రసీమకు దొరికిన నయా ఆర్నాల్డ్స్‌ మేమే అంటూ తమ కండల తిరిగిన దేహాలతో స్టైలిష్‌గా ఫోజులిస్తున్నారు. ఇంతకీ వీళ్లెవరో గుర్తుపట్టారు కదా.. ఒకరు నాగశౌర్య కాగా.. మరొకరు సుధీర్‌బాబు.


నిజానికి సుధీర్‌బాబుకు మొదటి నుంచీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ లుక్‌తోనే దర్శనమిచ్చేవారు. రానా, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలు సైతం బాడీని మెయింటైన్‌ చేయడంలో సుధీర్‌ హార్డ్‌వర్క్‌ను ప్రశంసిస్తుంటారు. కానీ, తాజాగా సుధీర్‌ పెట్టిన ఓ ఫొటో మరింత వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో సుధీర్‌ ఒంటిపై చొక్కా లేకుండా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ లుక్‌లో అతన్ని చూస్తుంటే హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ను చూస్తున్నట్లుగానే ఉంది. ఇంతకీ అతనీ లుక్‌ ఎందుకు సాధించాడో తెలుసా.. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ కోసం. దీన్ని సుధీర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘మాటలు, క్యాప్షన్స్‌లో కాదు.. యాక్షన్‌లో చూపించాలి’’ అంటూ ఓ కామెంట్‌ను జత చేశారు.


ఇక నాగశౌర్య విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ యువ హీరో లక్ష్మీ సౌజన్య అనే దర్శకురాలితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైనమెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర కథ రిత్యా ఇందులో శౌర్య సిక్స్‌ప్యాక్‌లో దర్శనమివ్వబోతున్నాడట. అందుకే ఆ లుక్‌ కోసమే జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసి మరి ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఉక్కులాంటి శరీరాకృతిని సంపాదించుకున్నాడట. తాజాగా ఈ ఫొటోను శౌర్య తన సామాజిక మాధ్యమాల్లో ఉంచగా.. సమంత ‘‘వావ్‌.. నమ్మలేకపోతున్నా’’ అంటూ కితాబిచ్చింది. ప్రస్తుతం దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.