సూర్యకు సత్యదేవ్‌ గాత్రం?

తమిళ నటుడు సూర్య చిత్రానికి టాలీవుడ్‌ యువ కథానాయకుడు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పబోతున్నాడా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సూర్య కథానాయకుడుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సురరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో విడుదల కాబోతుంది. గతంలో సూర్య పలు చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్‌ చెప్పినా.. ఈసారి మరొకరికి అవకాశం ఇస్తే భావుంటుందని భావించాడట. సూర్య బాడీ లాంగ్వేజ్‌కి తెలుగులో ఎవరు బాగా డబ్బింగ్‌ చెప్పగలరు? అనే అన్వేషణలో సత్య వాయిస్‌ అయితే సరిపోతుందని చిత్ర బృందం అనుకుంటుందని సమాచారం. ఇప్పటికే చర్చలు సాగాయని తెలుస్తోంది. మరి సూర్య నటనకు సత్య దేవ్‌ గాత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం వేసవిలో సందడి చేయాల్సి ఉండగా... లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.