`సైరా`లో అల్లు అర్జున్?

చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర ద‌క్కినా చాలు అంటుంటారు ఆయ‌న న‌ట వార‌సులు. చిరు రీ ఎంట్రీ సినిమా `ఖైదీ నంబ‌ర్ 150`లో రామ్‌చ‌ర‌ణ్‌కి మాత్ర‌మే ఆ అవ‌కాశం ద‌క్కింది. త‌న 151వ చిత్రంగా చిరు చేస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`లో న‌టించేందుకు కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మిన‌హా మెగా కుటుంబంలోని తార‌లంతా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. అయితే ఈసారి ఆ అవ‌కాశం నిహారిక‌కి మాత్ర‌మే ద‌క్కింది. ఆమె ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్‌కి కూడా ఆ అవ‌కాశం ల‌భించిన‌ట్టు స‌మాచారం. సినిమాలో ఒక అతిథి పాత్ర ఉంద‌ట‌. అందులో అల్లు అర్జున్ న‌టిస్తే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలిసింది. `సైరా న‌ర‌సింహారెడ్డి`లో బ‌ల‌మైన తారాగ‌ణం ఉంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి త‌దితర న‌టులు సినిమాలో ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఎంపిక‌య్యారంటే ఆ బ‌లం మ‌రింత పెరిగ‌న‌ట్ట‌వుతుంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`ని ద‌స‌రా సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.