నా తప్పులు ముందే తెలిసిపోతాయి
‘‘విమర్శల్ని స్వీకరించడానికి నేనెప్పుడూ సిద్ధమే. కాకపోతే నా తప్పులు నాకు ముందే తెలిసిపోతుంటాయి. అందుకే ఒకరు నన్ను విమర్శించినా పట్టించుకోను’’ అంటోంది తమన్నా. ఇటీవలే ‘ఎఫ్‌ 2’తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ‘దటీజ్‌ మహాలక్ష్మి’గా రాబోతోంది. తమన్నా మాట్లాడుతూ ‘‘చేసేటప్పుడు మన తప్పులు, లోపాలు మనకు తెలియకపోవచ్చు. ఒక్కసారి ఫలితం వచ్చేశాక తప్పకుండా అవి మన కంట పడకుండా పోవు. నా హిట్‌ చిత్రాల్లోనూ కొన్ని తప్పులు చూపించగలను. ప్రపంచంలో ఎవ్వరూ పర్‌ఫెక్ట్‌ కాదు. తప్పుల్ని సరిదిద్దుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లడమే మనం చేయగలిగింది. కాకపోతే నా వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగకూడదని భావిస్తాను. అందుకే సెట్‌కి వెళ్లే ముందే ఒకట్రెండుసార్లు నన్ను నేను సరి చూసుకుంటా’’అని చెప్పింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.