నలుగురికి నచ్చాలి..మనకు సౌకర్యవంతంగా ఉండాలి...

ఫ్యాషన్‌గా కనిపించడం పట్ల మీ ఆలోచనలెలా ఉంటాయి? అని తమన్నా అడగ్గా? అందుకు జవాబిస్తూ..‘‘నాకు మొదటి నుంచీ ఫ్యాషన్‌పై చక్కటి అవగాహన ఉన్నప్పటికీ.. హిందీ చిత్రసీమకి వెళ్లాక మరిన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా. నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే కంటికి కనిపించిన దుస్తులన్నీ వేయడం కాదు. నలుగురికీ కొత్తగా కనిపించాలి. అది ధరించే వాళ్లకి సౌకర్యంగా ఉండాలి. మనం వేసుకున్న దుస్తులు అసౌకర్యంగా ఉంటే.. అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేనెప్పుడూ బయటకెళ్లినా.. సినీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈ విషయాల్ని కచ్చితంగా పాటిస్తుంటా చెప్పేస్తోంది. తమన్నా ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకొని మళ్లీ తన పనులో బిజీ అయ్యింది. ప్రస్తుతం ‘సీటీమార్’‌ చిత్రంలో కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. నితిన్‌తో కలిసి బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అందాధున్’‌ చిత్రంలో టబు పాత్రనే తమన్నా నటిస్తోంది. మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.