ఆ మాట విన్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది

మనపై చేసే విమర్శల్ని చూసి బాధపడటం కంటే.. వాటిని స్ఫూర్తిగా తీసుకుంటే మరింత గొప్పగా పని చేయాలన్న పట్టుదల పెరుగుతుంది. అప్పుడా విమర్శే మన ఎదుగుదలకు పూల బాటలు పరుస్తుంది’’ అంటోంది నటి తమన్నా. ‘‘ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం చూశారు కదా. ‘ఇంతటితో ఆమె పని అయిపోయినట్లేన’న్న విమర్శలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా?’’ అని అడిగితే.. ‘‘నిజానికి ఇలాంటి మాటలెప్పుడూ నాకు ఆనందాన్నే కలిగిస్తుంటాయ’’ని షాకింగ్‌గా బదులిచ్చింది. ‘‘మీరు నమ్మండి.. నమ్మకపోండి.. ‘తమన్నా పని అయిపోయింది’ అన్న మాట విన్నప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అలా అన్నప్పుడల్లా నాకు మరిన్ని మంచి అవకాశాలొస్తుంటాయి. మరింత స్ఫూర్తితో పని చేయడానికి అవకాశం దొరికినట్లుంటుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు నేను సానుకూలంగానే తీసుకుంటుంటా’’ అని చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ. ప్రస్తుతం ఈ భామ గోపీచంద్‌ సరసన ‘సీటీమార్‌’లో నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.