టాక్సీవాలా... ఓ షాకింగ్ న్యూస్‌

అర్జున్ రెడ్డి సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ యూత్ లో మంచి ఫాలోయింగ్‌ని ద‌క్కించుకున్నాడు. వ‌రుస‌గా అవ‌కాశాల్ని సంపాదించుకుంటున్నాడు. త‌ను చేసిన రెండు సినిమాలు ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ద‌మ‌య్యాయి. టాక్సీవాలా, గీత గోవిందం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అయ్యాయి. అందులో `గీత గోవిందం` ఈ బుధ‌వారం విడుద‌ల అవుతోంది. ఇంత‌కు ముందే `టాక్సీవాలా` రావాల్సింది. కానీ.. నిర్మాణారంత కార్య‌క్ర‌మాల్లో జాప్యం వ‌ల్ల విడుద‌ల ఆల‌స్య‌మైంది. అయితే `టాక్సీవాలా`కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. `టాక్సీవాలా` థియేట‌ర్ల‌రో విడుద‌ల చేయ‌ర‌ట‌.. నేరుగా ఆన్ లైన్‌లో పెట్టేస్తార్ట‌. కొంత మొత్తం ఆన్‌లైన్ ద్వారా చెల్లించి ఈ సినిమాని ఇంట్లోనే చూడొచ్చ‌ట‌. ఇందుకు సంబంధించి చిత్ర‌బృందం ఓ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని టాక్‌. ఇది వ‌ర్క‌వుట్ అయితే.. ఇక మీద‌ట సినిమాలన్నీ థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా ఆన్ లైన్‌లోనే చూసేయొచ్చు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.