వెంకీ బాలనటుడిగా కనిపించిన చిత్రమిదే!

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే వెంకటేష్‌ ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. 1986లో వచ్చిన ఈ చిత్రంతో కథానాయకుడుగా దర్శనమిచ్చాడు. ప్రముఖ నిర్మాత రామానాయకుడు తనయుడిగా వెండితెరకు పరిచమైనా.. తన నటన ముందు ఆ బ్యాక్‌గ్రౌండ్‌ అవసరంలేకుండా పోయింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. అంతకు ముందు మరో సినిమాలో బాలనటుడిగా కనిపించాడనే విషయం కొందరికే తెలిసుండొచ్చు. అది ఏ సినిమానో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా 1971లో వచ్చిన ‘ప్రేమ్‌ నగర్‌’ చిత్రం. ఓ జమీందారీ కుటుంబంలో పుట్టిన బాలుడి పాత్రలో కనిపించాడు వెంకీ. బాల్యంలో వెంకీ నటన ఎలా ఉందో మీరూ చూసేయండి...Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.