`మ‌హావీర్ క‌ర్ణ` కోసం ముప్పై అడుగుల ర‌థం

విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా రూ: 300 కోట్ల వ్య‌యంతో `మ‌హావీర్ క‌ర్ణ‌` తెర‌కెక్క‌బోతోంది. హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొంద‌బోతున్న ఈ చిత్రం ఇత‌ర‌త్రా భాష‌ల్లో కూడా విడుద‌ల కాబోతోంది. హాలీవుడ్ చిత్రం `గేమ్ ఆఫ్ థ్రోన్స్‌`కి ప‌నిచేసిన ప‌లువురు టెక్నీషియ‌న్లని ఈ సినిమాకోసం ఎంపిక చేసుకున్నారు. వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి నుంచి చిత్రీక‌ర‌ణ షురూ అవుతుంది. సోమ‌వార‌మే తిరువ‌నంత‌పురంలో ప్ర‌త్యేక పూజ‌ల‌తో చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఆ ఆల‌యం నుంచి చిత్ర‌బృందం ఓ గంట‌ని కూడా తీసుకొచ్చింది. ఆ గంట‌ని మ‌హావీర్ క‌ర్ణ‌లో చూపించ‌బోతున్న ముప్పై అడుగుల భారీ ర‌థంలో అమ‌ర్చ‌బోతున్నారు. `బాహుబ‌లి`లోని భ‌ల్లాల దేవ విగ్ర‌హం త‌ర‌హాలోనే ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా ర‌థాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆ ర‌థం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వబోతున్నాయి. ఆర్‌.ఎస్‌.విమ‌ల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని సింహ‌భాగం స‌న్నివేశాల్ని రామోజీఫిల్మ్‌సిటీలో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.