వినాయక్‌ హీరోగా.. దిల్‌రాజు సినిమా??

వి.వి.వినాయక్‌లో మంచి దర్శకుడే కాదు.. ఓ గొప్ప నటుడు కూడా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఠాగూర్‌’ చిత్రంలో నటుడిగా ఓ చిన్న పాత్రలో కనిపించిన ఆయన.. అందులో తన నటనతో ప్రతి ఒక్కరిని కదిలించారు. అయితే ఇప్పుడీ స్టార్‌ డైరెక్టర్‌ని పూర్తిస్థాయి కథానాయకుడిగా మార్చబోతున్నారట నిర్మాత దిల్‌రాజు. ‘శరభ’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన ఎన్‌.నరసింహారావు ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. వినాయక్‌ త్వరలో రవితేజతో ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నాడంటూ వార్తలు వినిపించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటం కాస్త గందరగోళాన్ని సృష్టిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత? అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా పట్టాలెక్కేదెప్పుడు? వంటి వివరాలన్నీ తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.