వ‌స్తున్నాడు.. '118'

క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. గుహ‌న్ ద‌ర్శ‌కుడు. నివేధా ధామ‌స్‌, షాలినీ పాండే క‌థానాయిక‌లు. ఈ చిత్రానికి `118` అనే టైటిల్ ఖాయం చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ పెడ‌దామ‌న్న‌ది చిత్ర‌బృందం ముందు నుంచీ అనుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే `118` ఫిక్స్ చేశారు. ఈ అంకెకీ క‌థ‌కూ ఉన్న సంబంధ‌మే... సినిమాకి కీల‌కం. మ‌రి 118అన్న‌ది గ‌ది నెంబ‌రా? ఖైదీకి ఇచ్చే నెంబ‌రా? లేదంటే మ‌రోటేదైనా ఉందా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 2019 జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ రెండు భాగాలూ జ‌న‌వ‌రిలోనే విడుద‌ల అవుతాయి. అంటే 2019 తొలి నెల‌లోనే క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న మూడు సినిమాలూ ఒకేసారి వ‌స్తాయ‌న్న‌మాట‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.