‘18 పేజస్‌’ మొదలైంది

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ‘18 పేజస్‌’ తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. నేడు (మంగళవారం) చిత్రీకరణ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ లొకేషన్‌ స్టిల్‌ విడుదల చేసింది చిత్ర బృందం. నిఖిల్‌, అనుపమ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.