రెండు మెదళ్ల ‘బుర్రకథ’!

ది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. మిస్తీ చక్రవర్తి, నైరా షా కథానాయికలు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్‌.కె.శ్రీకాంత్‌ దీపాల నిర్మాత. గురువారం ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపం ‘బుర్రకథ’. కథకి తగిన పేరే పెట్టాం. ఫస్ట్‌లుక్‌ కూడా కథానుగుణంగా డిజైన్‌ చేశాం. ఆది పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తామ’’న్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని తదితరులు నటించారు. సంగీతం: సాయి కార్తీక్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.