ఆదా శర్మ కొత్త సినిమా ప్రారంభం

ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అజయ్ ముఖ్య తారాగణంతో నూతన చిత్రం ఇటీవలే హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వంలో, గౌరు ఘానా సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ "నా గత చిత్రాలు హార్ట్ ఎటాక్, క్షణం నాకు మంచి పేరు తెచ్చాయి, ప్రేక్షకులు నానుంచి మంచి సినిమాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా సినిమా. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత గౌరీ కృష్ణ మరియు దర్శకులు విప్రా గారికి ధన్యవాదాలు" అని తెలిపారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.