ఓ రేడియో చుట్టూ.. ఆ దట్టమైన అడవిలో!

తొలిసారి ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో అశ్విన్ గంగ‌రాజు దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న వైవిధ్యభరిత కథా చిత్రం ‘ఆకాశవాణి’. కీరవాణి తనయుడు కాల‌భైర‌వ స్వరాలు సమకూరుస్తున్నారు. ఓ రేడియో చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌విలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణ జరపుకుంటోంది. దీని గురించి దర్శకుడు అశ్విన్‌ మాట్లాడుతూ.. ``పాడేరు ప్రాంతంలో దాదాపు 50 రోజుల పాటు ఏక‌ధాటిగా జ‌రిగిన షెడ్యూల్‌ను అనేక సవాళ్ల మధ్య ఎంతో చక్కగా చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ చాలా అడ్వెంచ‌ర‌స్‌గా అనిపించింది. 90 శాతం సినిమా పూర్త‌య్యింది. ఇంకా 10 శాతం మాత్ర‌మే చిత్రీక‌రించాల్సిఉంది`` అన్నారు. అశ్విన్‌.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి వద్ద `ఈగ‌`, ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడు `ఆకాశ‌వాణి`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.