‘యాక్షన్‌...’ చెప్పేశారు!

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి క్లాప్‌ కొట్టారు. ఇప్పుడు చిత్రీకరణ కూడా మొదలైపోయింది. హారిక హాసిని, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతలు. సునీల్, టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, నవదీప్‌ కీలక పాత్రధారులు. బుధవారం హైదరాబాద్‌లో అల్లుఅర్జున్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా చిత్రబృందం మేకింగ్‌ వీడియోలో త్రివిక్రమ్‌ ‘యాక్షన్‌..’ చెప్తే.. అల్లు అర్జున్‌ కార్య సాధనలో దిగిపోయాడు. పది రోజుల పాటు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరగనుంది. ‘నాన్న - నేను’, ‘అలకనంద’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్, కూర్పు: నవీన్‌ నూలి, కళ: ఏఎస్‌.ప్రకాష్, ఎగ్జిక్యూటీవ్‌ నిర్మాత: పిడీవీ ప్రసాద్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.