ప్రారంభమైన ‘బన్నీ20’

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అల్లు అర్జున్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తుంది. సుకుమార్‌ దర్శకుడు. ‘అల్లు అర్జున్‌ 20’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకులు సురేందర్‌ రెడ్డి, కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్‌ హాజరయ్యారు. సురేందర్‌ రెడ్డి స్ర్కిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందివ్వగా.. కొరటాల గౌరవదర్శకత్వం వహించారు. అరవింద్‌ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌- బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ సినిమాలు యువతలో మంచి క్రేజ్‌ సంపాందించాయి. ఇప్పుడు ఈ కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.