‘బ్యాక్‌ డోర్‌’లో వస్తోంది

పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ‘బ్యాక్ డోర్‌ ఎంట్రీ అనే మాట ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సాధారణమైపోయింది. బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం పూర్ణకి మంచి గుర్తింపు తీసుకొస్తుంద’ని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి పాటలు: జావళి, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.