ఫ్రాన్స్‌లో ముగ్గురిని ముగ్గులోకి దింపాడు

వి
జయ్‌దేవరకొండ కథానాయకుడిగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. క్రాంతి మాధవ్‌ దర్శకుడు. కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లేదె కథానాయికలు. చిత్రబృందం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘ఇదో ముక్కోణపు ప్రేమకథ. ముగ్గురు అమ్మాయిలకీ, ఓ అబ్బాయికీ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, సంఘటనలతో నడుస్తుంది. యువతరానికే కాదు, కుటుంబ ప్రేక్షకులకూ తప్పకుండా నచ్చుతుంది. గోపీ సుందర్‌ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది. ఛాయాగ్రహణం: జేకే, సమర్పణ: కె.ఎస్‌.రామారావు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.