బృంద దర్శకత్వంలో దుల్కర్‌

ప్రముఖ కొరియోగ్రాఫ్‌ బృంద మెగాఫోన్‌ పట్టారు. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడుగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్, అతిథిరావు హైదరీ నాయికలు. రియలన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. చెన్నైలో గురువారం లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాకు గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నారు. టైటిల్, సాంకేతిక వర్గం కొన్ని రోజుల్లో ప్రకటించనుంది చిత్ర బృందం. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కమల్‌ హాసన్, రజనీకాంత్, సూర్య, మోహన్‌లాల్‌ తదితర స్టార్‌ హీరోల పాటలకు కొరియోగ్రఫీ చేశారు బృంద.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.